దేవుడు మమ్మును ఎంతగానో ప్రేమించారు కానీ ఆయన కుమారుని ప్రేమించలేదు, అతని
చనిపోవడానికి అనుమతించారు?
జవాబు: ఈ గాఢమైన రహస్యాన్ని యేసును స్వంత మాటలు ఉత్తమమైనదిగా వివరించింది.
- యోహాను 10:17-18 “ నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు [ఆయన మరణం తరువాత మూడు రోజుల్లో ఆయన పునరుత్థానం పొందారు]. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.
ఈ సత్యంలో ఈ గూడర్తమైన రహస్యం యొక్క వివరణ దాగి ఉంది అదేమనగా దేవుని సకల పరిపూర్ణమైన గుణతిషయములు ప్రతి సమయంలో పరిపూర్ణమైన సమరూపములో పని చేస్తుంది.
పరిపూర్ణమైన ప్రేమ మరి పరిపూర్ణమైన కరుణను ప్రదర్శించినప్పుడు దేవుడు పరిపూర్ణమైన న్యాయమును విడిచిపెట్టరు. ప్రతి చర్యలో ప్రతి యొక్క గుణతిషయములు పరిపూర్ణముగా ప్రదర్శించబడుతుంది.
హెబ్రీయులకు 9:22 రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు.
పాపము భయంకరమైనది! పరిపూర్ణమైన శాశ్వత జీవి యొక్క మరణము మరి రక్తం చిందించడంవలన దేవుని హుగ్రతన సంతృప్తి పరచి క్షమాపణ ఇవుటకు మరి పాపమును కప్పుటకు అవసరమైన మూల్యం చెల్లించగలదు. యేసు: దోషుల పాపాలను క్షమించుటకు పరిపూర్ణమైన నిర్దోషి అయిన మనిషి మరణించారు. సృష్టికర్తతో ప్రియమైన సంబందం లోనికి ఒక దోషి తిరుగీ వెళ్ళడానికి ఇది ఒకటే దారి. దేవుడు, కుమారుడి రూపం లో మనిషిగా మరి క్షమాపణ కొరకై మరణ శిక్షను సంతృప్తి పరచారు. అందువలన, పరిపూర్ణమైన దేవుడు మనిషిగా ఈ భూమి మీదకు వచ్చి, మనిషిగా పరిపూర్ణమైన జీవితాని జీవించారు, పరిపూర్ణమైన విధేయతతో సకల ధర్మశాస్త్రమును మరి అవసరతలను పరిపూర్ణముగా నెరవేర్చారు మరి ఎవరైతే ఆయనను నమ్మి, విశ్వాసించి మరి ప్రేమించుతారో వారి స్థానములో ఆయనను ఇష్టపూర్వకంగా ప్రత్యామ్నాయంగా సమర్పించుకున్నారు.
ఈ విశ్వం మరి మానవులను సృష్టించబడక మునపు ఉన్నట్టు ఒక దోషి, పాపము కలిగిన వ్యక్తి శుద్ధి పరచబడి దేవునితో తిరుగీ సమాదనం పొందుటకు ఇది ఒకటే మార్గం.
- ఫిలిప్పీయులకు 2:5-11 క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
యేసు స్వచ్ఛందంగా మరణించారు. పరిశుద్దమైన, సర్వశక్తిమంతుడైన దేవునికి ఏదైనా చేయడానికి ఎవరు బలవంతం పెట్టలేరు!
యేసు, పరిపూర్ణమైన కుమారుడు, మరి పరిపూర్ణమైన దేవుని మనిషిగా, స్వచ్ఛందంగా “పాపము మోయుటకై” ఎంచుకున్నారు, పాపము కొరకై ఏకైక వారీగా సమర్పించుకున్నారు. ఈ యొక్క స్వచ్ఛందంమైన చర్యవలన, తండ్రి అయిన దేవుడు అతని పరిపూర్ణమైన కుమారుడిని మరలా ఆయన దెగ్గరికే పరలోకనికి తీసుకెలడం మాత్రమే కాక ఎవరైతే యేసునిలో విశ్వాసించారో వారికి యేసుని యొక్క పరిపూర్ణమైన చర్యలో వారికి జమ చేయబడుతుంది. అందువలన, యేసుని పట్ల దేవునికి ఉన్న పరిపూర్ణమైన ప్రేమ అదికముగా విస్తరించబడిఉండి ఎందుకంటే యేసు దేవుని శాశ్వతమైన కుటుంబం లోనికి చాలా చాలా ప్రజలను తెచ్చినందువలన దేవుడు యేసు, ఆయన కుమారుడిని ఎలా ప్రేమించారో అలగునే అందరినీ ప్రేమించుతారు.
- హెబ్రీయులకు 2:9-18 దేవుని కృపవలన ఆయన ప్రతిమనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొంది నందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూ ర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక -.. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములుగలవారైనందున ఆప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును,.. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు.
సత్యం యొక్క సారాంశయం: దేవుని కుమారుడు స్వచ్ఛందంగా పరలోకని విడిచి రావడానికి ఎంచుకొని, ఈ భూమి మీదకు వచ్చి పాపము కొరకై మరణప్పు మూల్యని సంపూర్ణముగా చల్లించారు అందువలన మానవ కులం విమోచించ బడి మరి దేవుని పట్ల తిరుగి సఖ్యపరచ్చపడ్డారు.
- యోహాను 10:14-16 నేను గొఱ్ఱెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.
దేవుని యొక్క అద్బుతమైన ప్రేమను మరి త్యాగమును గురించి ఆలోచించినప్పుడు, మన తలను వంచి, హెబ్రీయులకు వ్రాసిన రచయితతో పాటు కలిసి కృతజ్ఞత స్తుతులు అర్పించుదము:
- హెబ్రీయులకు 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?
మరి, ఆయన క్షమాపణను ఎలా పొందగలము మరి రక్షణను ఎలా గెలవగలము?
- అపొస్తలుల కార్యములు 16:29-31 అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసికొనివచ్చి–“అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను.” అందుకు వారు– “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి.”
క్రీస్తునిలో, అందరికీ ప్రేమతో-
మీ స్నేహితులు @ WasItForMe.com