And he said, “Jesus, remember me when you come into your kingdom.” - Luke 23:42

ఆదాము మరియు హవ్వ నుండి వెలుగు వెళ్ళిపోయింది అని మీరు ఎందుకు అంటున్నారు?

Share Article

వారు పాపము చేసే ముందు:- ఆదికాండము 2:25 అప్పుడు ఆదామును అతని భార్యయు [హవ్వా] వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి.

వారు పాపము చేసిన తరువాత:- ఆదికాండము 3:6-7 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొనితిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడ తినెను; అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.

పైన ఉన్న వాస్తవాలను చదివాక, ఆదాము మరి హవ్వా వెలుగుతో కప్పబడి ఉన్నారు అని అంచనా వేసే వారితో చేరాలి అని మేము ఎంచుకున్నాము. వెలుగు దేవుని యొక్క స్పస్టమైన ప్రతిపదము. అతని స్వరూపమందు సృజించిన మానవ సృష్టిని ప్రకృతిబాహ్యమైన వెలుగుతో కప్పి ఉండటం అని అర్ధం అవుతుంది. 

వారు పాపం చేసిన తరువాత వారి మనసాక్షి వారిని ఖండించినది. వారి అవిదేయత వలన, వాళ్ళ తిరుగుబాటు మరి దోషముకు స్పస్టమైన సాక్షిగా భయం మరి నగ్నత్వం వెంటనే వారిపై వచ్చింది. 

మనం చదివినట్టుగా వెలుగు సృష్టికర్త అయిన దేవునికి చాలా చాలా ప్రముక్యమైనది [1 యోహాను 1:5-10] దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు. ఆయన ప్రస్తుతం ఉన్న విశ్వమును నశింప చేసి మరియు ఎక్కడైతే పాపము ఉండదు మరి చీకటి ఇంకా ఎప్పుడు ప్రవేశించని అలంటీ కొత్త నూతనమైన పరిపూర్ణమైన విశ్వమును సృష్టించిన తరువాత సమస్త విశ్వముకు అతని వెలుగు వ్యాపించుతుంది. 

  • కీర్తనలు 104:1-4 1 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించిన వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు. వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరనుaa పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచియున్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనముచేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసికొనియున్నాడు.

సత్యం: ఆదాము లోనికి దేవుడు జీవవాయువును ఊదినప్పుడు [ప్రకృతిబాహ్యమైన వెలుగు], ఈ వెలుగు అతని దేహములోనికి మరి అతని ఆత్మలలోనికి ప్రవేశించి యొక్క శాశ్వతమైన జీవిగా మార్చబడ్డాడు. అందువలన అప్పటి నుంచి పుట్టిన సమస్త ఆదాము సంతతులకు యొక్క శాశ్వతమైన ఆత్మను మరి శాశ్వతమైన గమ్యమును కలిగి ఉన్నారు.

మరణం తరువాత, ఈ లోకంలో శారీరికంగా పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క శాశ్వత జీవి అయినందున ప్రతి ఒక్కరు సమస్థాని నిత్యత్వములో గడపాలి అది సృష్టికర్త అయిన పరిశుద్ధ దేవునితో పరలోకంలో అయిన కావచ్చు లేక వారి అపవాది అయిన దెయ్యంతో అయిన కావచ్చు. 

నేపథ్యం: 1 యోహాను 1:5-10 దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.  

పరలోకప్పు భవిష్యత్తు చిత్రం: ప్రకటన 22:5 రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. 

ఈ వెలుగు [ఆదాము + హవ్వా లోన ఉన్న దేవుని సన్నిధి] పాపము చేసిన వెంటనే వారి నుంచి వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ యొక్క నిష్క్రమణ ఆదాము మరి హవ్వా అనుభవించిన మొదటి మరణం. ఆదాము మరి హవ్వాకు దేవునితో నేరుగా ఉన్న సంభాషణ సంబంధం తెగిపోయింది. కొంత కాలం తరువాత, దేవుని పరిపూర్ణమైన సమయం పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు, ఆదాము మరి హవ్వా ఇద్దరి యొక్క శారీరకమైన దేహములు మరణించాయి. 

ఎలాంటి అందకారం లేకుండా, మరి పరిపూర్ణమైన సంతోషం మరి శాశ్వతమైన సమాదనంతో మనం ఆదాము యొక్క సంతతిగా ఎలా ఏదేను, తప్పిపోయిన పర దైసులో నుంచి పరలోకమునకు వెళ్లగలము?

ఏం జరగాలి అని మన సృష్టికర్త అయిన యేసు సాధారణముగా ప్రకటించారు:

  • యోహాను 3:5-8 యేసు ఇట్లనెను–ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.  

దేవుడు వెలుగై యున్నాడు అన్న దాని పై అదనపు వ్యాఖ్యానం – 

సకల శక్తికి మూల కారణం దేవుడు! సృష్టికర్త అయిన దేవునిలో మాత్రమే, ఏమి లేని దానిలో నుంచి సృష్టిచే సామర్థ్యం ప్రవహించుతుంది, ఆయన చిత్తమును సంభాషిస్తూ మరి నిర్జీవముగాల దానికి జీవమునిచ్చును. 

పరిపూర్ణమైన పరిశుద్దత మరి స్వచ్ఛతతో దేవునిలో చీకటి లేదు. ఆయని సన్నిధిలో ఎలాంటి చీకటి నిలువదు. వెలుగు సమీపించినప్పుడు చీకటి పారిపోవును. చీకటి అంటే వెలుగు లేకపోవడం. 

మానవులందరు జీవులు ఆత్మిక [శాశ్వతమైన] మరియు శారీరకమైన [తాత్కాలికమైన] రెండు లక్షణాలతో చేయబడ్డారు

-ఆదికాండము 1:26 దేవుడు–మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు ఏలుదురుగాక. 

– ఆదికాండము2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. [దేవుని వెలుగు/శక్తి ఆదాము లోనికి ప్రవేశించి మరి అతను శాశ్వతమైన జీవిగా మార్చబడ్డారు]

దేవుని ఆత్మతో ఆదాము శాశ్వతమైన జీవిగా మార్చబడ్డాడు మరియు శారీరకమైన దేహము కూడా ఇవ్వబడింది దేవనితో సంభాషించగలరు మరియు అంతరాత్మను పొందగలరు, భావోద్వేగాలను అనుభూతి చెందుటకు, మరియు చెడు లేక మంచి, తప్పు ఒప్పులను ఎంపిక చేయడానికి మితమైన స్వేచ్ఛా-సంకల్పం ఇవబడింది.

ఏం జరిగింది? వారి పరిపూర్ణమైన వాతావరణంలో దేవునితో పరిపూర్ణమైన సహవాసం కలిగి ఉండే ఒకే ఒక దేవుని ఆజ్ఞకు ఆదాము + హవ్వా తిరుగుబాటు చూపించారు. 

– ఆదికాండము 3: 8-13 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్లమధ్యను దాగు కొనగా 

దేవుడైన యెహోవా ఆదామును పిలిచి– నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు–నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను. అందుకాయన–నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను. 

అందుకు ఆదాము–నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో–నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ–సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను.

సమస్త మానవ జాతికి ఈ పాపం ఏం తీసుకొని వచ్చింది? మరణం! అప్పటినుంచి పుట్టిన మానవ రక్త నాడులకు పాపం మరియు మరణం ప్రవేశించినది. 

ఆ ఒక్క తిరుగుబట్టు క్రియవలన పాపం ఎలా కనిపించినది?

ప్రకృతిభాహయమైన దేవుని జీవవాయువును పొందక ఇప్పుడు సకల మానవ కులం ఈ లోకం లోనికి జన్మించింది మరి దానికి బదులుగా వారి అపవాది అయిన దెయ్యం పిల్లలుగా, జన్మించారు [సహజ కాన్పు ద్వారా]!

రోమా 3 :9-18 వారందరూ [మానవ కులం] పాపము క్రింద ఉన్నారు. వ్రాయబడినట్లుగా: ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా– నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతిమార్గము వారెరుగరు. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.

మనం ఏం చేయగలము? ఏమియు లేదు! పరిశుద్ద దేవుని పరిపూర్ణమైన న్యాయము వలన మన స్వంత శక్తి లేక క్రియలతో మన పాపము వలన కలిగిన మరణప్పు ఋణముకు మూల్యం చెల్లించుటకు సామర్థ్యం లేదు. 

ఆదాము పాపము, ఏదైతే సకల మానవ జాతి యొక్క రక్త నాడులలో పాపముకు జన్మ ఇచ్చిన్నపుడు మనము ఏం చేయలేకపోయామో అలాగునే మన పాపము మరి దోషములను తొడచివేయుటకు మన గురించి కూడా మనం ఏమి చేయలేము. మనం పాపపు స్వబావముతో జన్మించాము మరి మరుజన్మ పొందక పోతే శాశ్వతమైన మరణముకు ఖండించబడుదుము. 

పరిశుద్ద దేవునితో సహవాసమును పునరుద్ధరించుటకు మన బయట నుంచి ఒక రక్షకుడిని పొందవాల్సి ఉంది. 

ఆదాము పాపము చేసినప్పుడు మనము ఏమి చేయలేకపోయాము, మరి దేవుని ప్రేమకు కూడా మనము ఏమి సహకరించలేము ఎవరైతే మనలను ప్రేమించుటకు మరి మన స్థానంలో మరణించడానికి ఎంపీక చేసుకున్నారు, ఆయన మన పాపము మరి దోషము నిమిత్తం మరణించారు.   

పరిశుద్దమైన దేవుడు ఇలా ఎందుకు చేశారు? నమ్మశక్యం కాని నొప్పి మరి ఈ విషాదమును అనుభవించడానికి ఎందుకు స్వచ్చందంతో ఎంచుకున్నారు? ఎందుకంటే దేవుడు మనలను ప్రేమించారు, ఆయన సృష్టిని, మరి శాశ్వతంగా ప్రేమించడానికి ఒక కుటుంబమును కోరుకున్నారు. ఈ కుటుంబం పరిపూర్ణమైన దేవుని కుమారుని వల్లే ఉండుటకు “మరుజన్మ” పొందాలి. 

దేవుడు మనలను ఎందుకు ప్రేమించుతున్నారు? సాధారణమైన సత్యం: దేవుడు మనలను ప్రేమించుతున్నారు ఎందుకంటే ఆయన మనలను ప్రేమించారు!

దేవుడు మనలను ప్రేమించుతున్నారు, అతని మానవ సృష్టిని. ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నారు అదేమనగా ఆయన పరిపూర్ణమైన మనిషిగా/పరిపూర్ణమైన దేవుడిగా వచ్చి ఎవరైతే యేసు క్రీస్తుని నమ్మి, విశ్వాసించి, ప్రేమించి మరి వెంబడించువారి పాపములకు మరణపు మూల్యం చలించక పోతే మనం ఎప్పటికీ ఖండించబడుదుము. 

ఒకే ఒక నివారణ: ప్రతి యొక్క స్త్రీ, పురుషులు, అబ్బాయిలు మరియు అమ్మాయిలలో ఆ వెలుగు [దేవుని ఆత్మ] మరలా వారి హృదయాలలో పుట్టాలి!

యోహాను 3:3-9 అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను. అందుకు నీకొదేము – ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను–ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను. అందుకు నీకొదేము–“ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా?”

ఈ విషయాలు ఇలాగే ఉంటాయి!

యోహాను 3:14-21 అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను [సీలువ వేయుత్త ద్వారా యేసుని మరణం]. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డైవెనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిం చును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.

క్రీస్తు ప్రేమికులుగా, క్రీస్తు అనుచరులుగా, మరుజన్మ పొందిన వారీగా, మన హృదయాలలో పునః వెలిగించబడిన ఆ వెలుగు నిలచి ఉండుటకు మన భాద్యత ఏంటి?

1 యోహాను 1:5-10 మేమనగా–దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు. ఆయనతోకూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. [దీని అర్థం సతతముగా క్షణ క్షణమందు మనం వినయముతో ఒప్పుకోవడం అభ్యాసం చేస్తూ ఆ వెళుతురులో నిలచి ఉండాలి అని ఆశించాలి.] 

మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు. మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. 

 యేసు ఈ లోకానికి వెలుగై ఉన్నారు!

యోహాను 1:8-13 అతడు [యోహాను]ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు [యేసు] ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతిమనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. 

ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

యోహాను 8:12 మరల యేసు–నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను

యోహనా 12:44-50  అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను–నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను [యేసు, దేవుడైన కుమారుడు] చూచువాడు నన్ను పంపినవానినే [తండ్రి అయిన దేవుడు] చూచుచున్నాడు. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండినయెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను

తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నాననెను.

ఎప్పుడు చెప్పని ఒక గొప్ప ప్రేమ కథ అది యేసు క్రీస్తు! ఒక నిర్దోషి [దోషుల కొరకై యేసు మరణించారు [మీరు మరి నేను] అందువలన దోషులు క్షమించబడుదరు మరి పరిపూర్ణ వెలుగులో శాశ్వతమైన జీవం ఎక్కడైతే చీకటి మరలా ఎప్పుడు ఉండదు. 

మీ గొప్ప ప్రశ్నల కొరకై మరలా కృతజ్ఞతలను తెలుపుతున్నాము. మీ ప్రశ్న సకల ముక్యమైన ప్రశ్నలకు దారి తీస్తుంది: మీరు మరుజన్మ పొంది ఉన్నారా? ,మీ హృదయం లోనికి యేసు క్రీస్తుని పొందుకున్నార  మరి అలాగే మీ హృదయం లోనికి దేవుని ఆత్మను కూడా పొందుకున్నార? ఎప్పుడైతే ఆ నూతన జన్మ కలుగుతుందో యేసు క్రీస్తుని పోలి మారుప్పు చెందుటకు దేవుని ఆత్మ ప్రక్రియను మోదులు పెట్టుతారు. 

మీరు ఆశీర్వదించబడి ఉంటే, మాకు మీ లేకనల ముఖాంతరం తెలుపండి, మీతో కలిసి మేము సంతోషించుతాము. 

మీరు ఇంకా చీకటిలో నడుచుతూ ఉన్నారా మరి దేవుని వెలుగు మీలో ప్రత్యక్షంగాలేదా, యేసు గురించి నిజమైన మీ విశ్వాసం ఏంటి అని దయచేసి ఈ రోజే నిర్ణయించండి. ప్రేమ స్వచ్చందమైనది! దేవుడు తన కుమారుడైన యేసుని ప్రేమించమని బలవంతం పెట్టరు, ప్రతి వ్యక్తి యేసుని ప్రేమించాల లేక ఆయనను తిరస్కరించాల అని ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి.

మీ సమస్త నిత్యజీవమును ఎక్కడ గడుపుతారాన్ని నిర్దారించుటకు యేసు గురించి నిజమైన మీ విశ్వాసం ఏంటి అని అతి ముక్యమైన ఆలోచనయి ఉంది అది ఆయనతో పరిపూర్ణ శాశ్వతమైన సంతోషం కలిగిన పరలోకంలో అయిన కావచ్చు లేక పరిపూర్ణ నప్పి మరి నిరాశ కలిగిన నరకమైన కావచ్చు. 

ఈ లేఖనం మీ పంపుతుండగా మీ కోసం ప్రార్థన చేశాము. మేము ఇలా చేయడానికి కొనసాగించుటకు దయచేసి మీ విజ్ఞాపనలో మీ ప్రత్యుత్తరం తెలపండి. 

క్రీస్తునిలో, మరింత ప్రేమతో, 

జోన్ +ఫిలిస్+స్నేహితులు @ WasItForMe.com

“నేను విశ్వసించుచున్నాను!” https://vimeo.com/9432896553 సీలువలు.. 2 యే దోషులు https://vimeo.com/687983931

You might also like

Was It For Me_It Is Matter Of What We Love Essay Image
Essay

It is a matter of what we love

Why is our culture overwhelmed by: Malformed Relationships, Materialism / Debt / Violence, Addiction to Media / Entertainment? Actually, the answer is…

Was It For Me_Heaven It Is Impossible for God to Lie Essay Image
Essay

Heaven, it is impossible for God to lie

So that by two unchangeable things, in which it is impossible for God to lie, we who have fled for refuge might have strong encouragement to hold fast to…

Would you pray for me?

Complete the form below to submit your prayer request.

* indicates required

Join our email list

To sign up for daily meditations, please complete the form below.

Would you like to ask us a question?

Complete the form below to submit your question.

* indicates required