దేవుడు అందరినీ రక్షించుతార లేక కొందరినే రక్షించుతార?
సత్యవేదంలో ఉన్న దేవుడు సకల మానవ కులాని రక్షించే ప్రణాళికలో ఉన్నారా లేక కొందరిని మాత్రమే రక్షించుతార?
ఇది చాలా సవాళుతో కూడిన ప్రశ్న, ముక్యముగా దేవునికి మాత్రమే, తన ప్రతి నిత్యత్వమును కూర్చిన ఉద్దేశం తెలిసిఉనది. మానవ కులానికి గ్రహింపగలిగే కొన్ని మంచి విషయాలను మాత్రమే దేవుడు బహిరంగపర్చుతారు. ఎన్ని ఆత్మలు రక్షింపబడి నిత్యత్వములో గడుపుతారని ధర్మశాస్త్రములో దేవుడు స్పస్టపరచి ఉనారు అనడం గురించి ఈ ప్రశ్న ఆడగబడుతుంది.
స్పస్టతతో జవాబు ఇవడానికి ఈ ప్రశ్నను రెండు బాగములకా విభజించుదము:
- ధర్మశాస్త్రములో ఉన్న దేవుడు సకల మానవ జాతిని రక్షించే ఉద్దేశం ఉనద? లేదు!
- కొంత మంది మాత్రమే రక్షించబడుతార? అవును, కానీ సకల మానవ కులములోని, ఆ కొంత మంది ఎవరైతే రక్షింపబడిఉనారో వారు గొప్ప సంఖ్యగా ప్రాతినిధ్యం వహించుతారు మరియు లోతులో కానీ వెడలపులో కానీ “సంఖ్యను మించినదిగా” పరలోకంలో క్రీస్తుని అనుచరులుగా చూపించబడుతారు.
రెండు భాగాలుగా మా జవాబు ఇవబడుతుంది:
భాగం -1
లేదు! సత్యవేదంలో సకల ప్రజలకు విశ్వా రక్షణ అనే ప్రణాళికా లేదు. స్వర్గం మరియూ నరకం అని నిత్యమైన స్థలం గురించి సత్యవేదంలో చాల వాక్యాలు ఉనాయి. స్వర్గం అనుగా నిత్యత్వములో ఉన్న సంపూర్ణ సంతోషం దేవుని ప్రసన్నతలో ఉనట్టు సూచించుతుంది. నరకం అన ఈ శాశ్వతమైన స్థలం ఎప్పటికీ పడిపోయిన వారికొరకై, తిరుగుబాటు దూతులకొరకై మరియు చాలా మంది మనుషులకు ఎవరైతే దేవునినుంచి వేరుపరచి ఎప్పటికీ బాధలో గడిపేలా యేసు దీని సిద్ధపర్చారు.
- మత్తయి 25 :41 [ప్రజలతో మాటలాడినరు] “అప్పుడాయన యెడమవైపున ఉడువారిని చూచి, ‘శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.”
- మత్తయి 20: 15-16 నాకిష్టమువచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. “కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే.”
- మత్తయి 22:13-14 అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా “పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.”
భాగం -2
అవును మరియు లేదు. అవును, ఒక గొప్ప సంఖ్య, రక్షింపబడుతుంది. లేదు, ఎందుకంటే ఆ సంఖ్య పుట్టిన సకల మానవ కులంలోనుంచి కొంత మందిని మాత్రమే సూచించుతుంది.
కొంత మంది మాత్రమే రక్షించబడుతారు చాలా మంది నశించబడుతారు అని యేసు ప్రకటించును.
ఒక అతి ముక్యమైన సత్యం, రక్షణ అనడం వ్యక్తిగతముగా ఒకరికి అన్వయించబడిఉంటుంది, సమూహంముకు కాదు, ఎందుకంటే మరణం శాశ్వతముగా ముద్రవేయబడినది!
ప్రతి వ్యక్తి గురించి యేసు ఆందోళన చెంది ఉనారు. ప్రతి వ్యక్తి వారి శాశ్వత విది కొరకై అతను చాలా ఆందోళన కలిగి ఉన్నారు. అతను ప్రతి ఒక్కరినీ ఎచ్ఛరించి మరియు ఆహ్వానిస్తునారు ఈ సత్యం ఒక కారణమై ఉనది. తండ్రియాయిన దేవునినుంచి వేరుపరచడం గురించి మరియు బయంకరమైన నరకం గురించి యేసు ప్రతి ఒక్కరికీ వివరిస్తూ ఎచ్ఛరించుతునారు. అదే సమయంలో ఎవరైతే ఆయనలో విశ్వాసించినారో వారికి నాతో పరలోకనికి రమ్మని ఆహ్వానం ఇస్తునారు. యేసు ఒక విషయం అయితే స్పస్టపరచారు ఆదేమనుగా మీరు ప్రవేశించాలి అని అనుకుంటే, “ రక్షణ తలుపులు” ఈ రోజు మీకు తెరవబడిఉంది.
మత్తయి 11: 28 “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.”
యేసు మిమ్మల్ని అంగీకరిస్తారని మీకు ఎలా తెలుసు? ఆయన సులబముగా ప్రకటిస్తునారు: “ఎవరైతే రావాలి అని అనుకుంటునరో” ఇది ఒక అతిశయోక్తికమైన పదం అనుగా దీనికి ఎలాంటి సరిహద్దులు లేవు, మరియు ఇందులో అని తరాలనుంచి సకల ప్రజలు కుడి ఉనారు.
యేసు చెప్పను ఆయనతో పాటు మనము పరలోకనికి రావచ్చు అని. వాస్తవానికి, ఆయన ఆదేమని చెప్పారు అంటే, ఎవరికైతే ఆశ ఉనదో వారు రావచ్చు! మరి అందులో మీరు కూడ
పాలుపంచుకొని ఉనారు. యేసుతో పాటు మీకు వెళ్లాలన ఉందా?
- ప్రకటన 22: 17 ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
- మత్తయి 10:32 మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.
- యోహాను 11:26 [యేసు చెప్పను] బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.
- అపొస్తలుల కార్యములు 10:43 ఆయనయందు [యేసు] విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను.
- రోమా 10:11 శాస్త్రము ఇలా చీపును, “ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.
- 1 యోహాను 4:15 యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పు కొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.
- యోహాను 6:37-40 [యేసు చెప్పను] “తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను. నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది. కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.”
మరణమును మించి పరలోకమునకు వెలుటకై యేసు ఇచ్చు ఆహ్వానని తిరస్కరించిన వారికి, ఈ క్రింద ఉన్న ఎచ్చరికల అనువర్తింపదగినది:
- మత్తయి 7:13-14 “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.
- యోహాను 12: 48 నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.
- మత్తయి 22: 13 అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను
- మత్తయి 25:30 మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.’
- లూకా 4:28-29 సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములోనుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయ వలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొనిపోయిరి.
- మత్తయి 8:34 దిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.
- యోహాను 1:11 ఆయన (యేసు) తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
- మార్కు 6:3 ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.
- 2 పేతురు 2:4-10 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. (ఆ నీతిమంతుడు వారిమధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను). భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచ బడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్చా పరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు.
ఈ యేసు, ఎవరైతే ఆయనను తిరస్కరించారో వారిని కలుగు భయంకరమైన, విషాదకరమైన ముగింపు గురించి ఎచ్ఛరించారో, మరియు పరలోకమలో ఆయనతో ఉన్న వారి సంఖ్య లెక్కించబడనది.
- ప్రకటన 5:8-10 .. ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు– నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.”
యేసు క్రీస్తు వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరిని ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళడానికి ఆహ్వానిస్తునారు. మీరు వస్తారా?
ఇది అంతా యేసుని గురించి!