నేను ఎందుకు ఇలాంటి క్రూరమైన దేవుని ప్రేమించాలి?
ప్రజలు తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు, క్రూరముగా చంపబడినప్పుడు, స్త్రీలను శారీరికంగా హింసించినప్పుడు దేవుడు ఎందుకు మౌనముగా ఉన్నాడు? అలాంటి దేవుని నేను ప్రేమించాల?
జవాబు: ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించుతునారు! దేవుడు తన మానవ సృష్టిని ప్రేమించుతునారు. ఆయన పరిపూర్ణమైనవారు, మంచివారు, క్రూరమునకు వెతిరేకమైనవారు మరి సంపూర్ణముగా నీతిమంతుడు. నాక మీకు మరియు ఈ లోకములో ఉన్న సమస్త ప్రజలందరికీ ప్రతి క్షణము ప్రతి రోజు సజీవముగా ఉండుటకు ఊపిరిని అనుగ్రహిస్తూ, మరి ఆహారముతో మనలను సంరక్షించుతూ ఆయన ప్రేమను నిరూపించుతునారు.
దేవుని ప్రేమ https://vimeo.com/912288970
ప్రియ స్నేహితులారా పరిశుద్ధమైన దేవుడిని న్యాయము తీర్చుటకి మీ హృదయములో ఏదైనా మంచి గుణాలు ఉన్నాయా అని కనిపెట్టుటకై ప్రయత్నిస్తునారా? మనుషులు తరచుగా వారి హృదయములో దేవుని తప్పుడుగా దూషించడానికి వారిలో ఏదైనా మంచి గుణాలు ఉన్నాయా అని కనిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మానవులు తరచుగా దేవుని పరిపూర్ణమైన గుణముల పై వారి గుణాలను మరి సామర్థ్యములను ఎచింప చేసుకొని ఈ విదముగా దేవుడు అన్వర్థము కలిగిన గుణం మరి అసమర్థుడు అని దూషించుతారు.
ఇలాంటి అబద్దపు ఆలోచనలు సాహసోపేతమైన పరిణామముకు దారి తీస్తుంది: నేను దేవుడైతే నేను సంపూర్ణముగా భిన్నమైనవానిగా ఉండును. ఎలాంటి చెడును, నొప్పిని అనుమతించును, ఎందుకంటే నేను మంచి, కనికరం మరి ఇతరులకు ప్రియమైనవారీగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలను సృష్టించేను.
అయినప్పటికి, ఇలాంటి అబద్దపు ఆలోచనలు కలిగిన జీవులు స్వేచ్ఛా సంకల్పమును కలిగి ఉండరు. అలాంటి జీవులు స్వేచ్ఛా సంకల్పం లేక కేవలం రోబోట్స్ లాగా ఉండూరు కానీ మనుషులుగా కాదు!
ఈ జీవులకు స్వేచ్ఛా సంకల్పమును యిచ్చిన యెడల వారు ప్రేమించడంతో పాటు ద్వేషించే సామర్థ్యం కలిగి ఉండాలి అది మీరు చూడలేద? ఒక సూచనం లేకుండా ప్రేమకు ఎలాంటి అర్థం లేదు. ప్రేమ గురించి తెలుసుకోవాలి అంటే, ఒక జీవి దానికి వెతిరకమైన ద్వేషం గురించి కూడా తెలిసి ఉండాలి. నిజమైన ప్రేమ స్వచ్ఛందంగా ఎంచుకోబడాలి!
మన ఒకే ఒక నిజమైన దేవుడు మరి సృష్టికర్త ఆయనను స్వచ్ఛందంగా ప్రేమించడానికి ఒక కుటుంబమును కోరుకున్నారు. దేవుని స్వచ్ఛందంగా ప్రేమించాలి అంటే ఒకరు స్వచ్ఛందంగా దేవుని తిరస్కరించి మరి ద్వేషించే సామర్థ్యం కూడా కలిగి ఉండాలి.
ప్రధాన్యము ఇచ్చుటకు, ఈ క్రింద ఉన్నది సంపూర్ణముగా నిజమై ఉండాలి: ఒక జీవి దేవుని ప్రేమించాలి అంటే వారు దేవుని తిరస్కరించి మరి ద్వేషించే సామర్థ్యం కలిగి ఉండాలి. “ ఒకరు తన పొరుగువారిని ప్రేమించే సామర్థ్యం కలిగి ఉండుటకు వారికి తమ పొరుగువారిని ద్వేషించే సామర్థ్యం కూడా కలిగి ఉండాలి.”
ఈ రోజు మీ స్వేచ్ఛా సంకల్పముతో, దేవుని ప్రేమించడానికి కానీ ద్వేషించడానికి ఎంచుకుంటార మరి మీ పొరుగువారిని ప్రేమించితార లేక ద్వేషించుతార!
క్రింద ఉన్నటి వంటిది స్వచ్ఛందంగా చర్య ద్వారా ప్రేమించుటకై దేవుని స్వేచ్ఛా సంకల్పం మరి ఆయన సృష్టిపై కుమ్మరించబడి ఉంది:
రోమా 5 :6 ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను 7నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును. 8అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. 9కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము. 10ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.
దేవుడు మనలను ఎంతో ప్రేమించెను గాక మన కొరకై స్వచ్ఛందంగా మరణించేను. దేవుడు మనలను తిరుగి ఆయనను ప్రేమించమని బలవంతం చేయరు!
ఎందుకంటే ప్రేమ స్వచ్ఛందంగా చేయవలసినది, బలవంతముతో లేక ఇష్టం లేని ప్రేమ ప్రేమ కాదు. ఇష్టం లేని ప్రేమ బలవంతపు విధేయత నిజమైన సంబందం లో ఉన్న ఆ వెచ్చదనం గల నాణ్యత అప్యాయత కలిగి ఉండదు.
సకల క్రూరత్వం, నొప్పి, దుఃఖము, బాధ, విషాదం, మరి మరణం పరిశుద్ధమైన దేవుని ద్వారా కలగ లేదు కానీ పాపము నిండిన మానవ కులం దేవుని ప్రేమను తిరస్కరించడం ద్వారా కలిగింది.
ఎప్పుడైతే ఒక వ్యక్తి తన స్వంత హృదయం చూసునప్పుడు, వారిలో ఉన్న కొన్ని “మంచి గుణాలను” చూడడానికి నిశ్చేయించుకుంటారు. ఇవి ఆదమ్ మరి హవ్వా పరిపూర్ణమైన ఏదెను తోటలో నుంచి పాపపు స్వభావం యొక్క ఎంపిక ద్వారా ప్రకటిస్తునారు [అభిప్రాయవివరణము]. “ మాకు మేమే స్వంత దేవుడుగా ఉండాలి. సృష్టికర్త అయిన దేవుడు మా మీద అధికారం చేయవలసిన అవసరత లేదు.”
ఈ యొక్క పడిపోయిన పొరపాటు ద్వారా మాకు మేము దేవుడిగా ఉండాలి అని కోరుకుంటారు ఈ ఆలోచన ఒక వ్యక్తి యొక్క హృదయములో దేవుని తప్పుడుగా చెడుకి ఆశ్రయం ఇచ్చువారు అని దూషించుతారు లేక చెడుని ఆపలేనంత శక్తిహీనులుగా ఉన్నారు. అందువలన ఈ భ్రష్టుపట్టిన చీకటి జీవుల మెదటి ద్వారా పరిపూర్ణమైన సృష్టికర్థుని ప్రేమ యొక్క లోతును అర్థం చేసుకోక ఆయనను న్యాయము తీర్చుటకై ప్రయత్నిస్తారు ఎవరైతే ఆయన కుమారుడైన యేసునిలో విశ్వాసించుతారో వారిని ఈ ప్రేమ మానవకులమును రక్షించి తిరుగి శాశ్వతమైన కుటుంబంలోనికి తీసుకెలడానికి ఓపికతో పని చేస్తు ఉంది.
క్రింద ఉన్నటిది దేవుని పరిపూర్ణమైన ప్రేమ యొక్క ధర్మము.
-మార్కు 12:29 అందుకు యేసు – ప్రధానమైనది ఏదనగా – ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. 30నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ. 31రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను.
ప్రశ్న: ఈ ప్రపంచం మొత్తం ఎందుకు క్రూరముతో, ప్రేమ లేకుండా, స్వార్థముతో మరి మోసప్పు ప్రజలు చర్యలతో నిండి ఉంది?
జవాబు: ఎందుకంటే దేవుని ప్రేమ యొక్క నియమమును ఉల్లంగించి ఉన్నాము. పరిశుద్ధమైన దేవుని పట్ల మనం అందరూ నిరంతరంగా తిరుగుబడుతూ ఉన్నాము మరి మన పొరుగువారికీ హాని చేసినవారీగా ఉన్నాము. [ఏదో యొక్క విదముగా మనకు దెగ్గరివారీగ మానసికంగా, మాటలు ద్వారా, భావోద్రేకథ ద్వారా లేక శరీరకముగా స్పర్శించగలిగే వారు].
మీకు మరి నాకు తెలుసు దేవుని పరిపూర్ణమైన ప్రేమ యొక్క నియమమును ఉల్లంగించి ఉన్నాము మరి మనం అంతా దోషులమే. అందుకొరకే మనలను సదాకాలము పరిపూర్ణముగా ప్రేమించు పరిశుద్దమైన దేవుని తీర్పు తీర్చడం మరి మన హృదయాలను పరిశీలించడం మూర్ఖత్వం. మనం అందరు దోషులైన పాపులే. దేవుని లా మన అస్తిత్వముకు యే విషయములోను పరిపూర్ణము లేదు.
ఇంకా: పాపముతో నిండిన మానవులు, నిజమైన దేవుని తప్పుగా తీర్పు తీర్చిన తరువాత, అబద్ధమైన దేవుళ్లను సృష్టించడం ప్రారంభించుతారు. మానవుల లాగే పడిపోయిన ఊహ ద్వారా అబద్ధప్పు దేవుళ్లను సృష్టించారు కాకపోతే దానికి కొన్ని సార్లు ఎక్కువ శక్తిలు ఉంటాయి. ఈ అబద్ధప్పు దేవుళ్ళు క్రూరముగా, ప్రేమ లేకుండా, స్వార్థముగా, వంచనతో, పాపము నిండిన మనుషుల గుణాలు వలె వారిలో కనబడుతుంది.
ఈ భూమి మీద నడచిన ఒకే ఒక పరిపూర్ణమైన మనిషి యేసు ప్రభు. ఆయన సృష్టిని ఆయన ఎంతో ప్రేమించారు వారికి ఆయన ప్రేమను చూపించడానికి వచ్చారు. యేసు న్యాయమైన మంచి చర్యలు మాత్రమే చేశారు. ప్రజలను వారి రోగముల నుంచి స్వస్థపరచెను. , ఇంకా తినలేనంతగా వారందరికీ అద్బుతముగా భోజనము పెటేను. దయ్యము పట్టిన వారిని దుష్టశక్తిల నుండి విడిపించేను. మరి మరణము నుంచి కొంత మందిని జీవమునకు తెచ్చెను.
అవకాశం ఇచ్చినట్లయితే, పాపము నిండిన మనిషి ఎప్పుడు అపహాస్యం చేసి, ఉమ్మివేసి, దైవదూషణ చేసి, శపించి [చిత్రహింస పెట్టి] మరి దేవుని కుమారుడిని చంపడానికి ప్రయత్నిస్తారు, యేసు క్రీస్తు వారిని పరిపూర్ణముగా ప్రేమించుతారు.
ప్రజల మీదట ఊహించలేనంత ప్రేమను, మంచితనమును కుమ్మరించిన తరువాత, అదీపతి అయిన పిలాతు, రోమన్ అధికారి ప్రజల సమూహమును మీరు యేసునితో ఏం చేయాలి అని అనుకుంటునారు అని అడిగినప్పుడు.
జన సమూహం యొక్క స్పందన:
- మార్కు 15: 11 అతడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి. 12అందుకు పిలాతు–ఆలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరల వారి నడిగెను. 13వారు–వానిని సిలువవేయుమని మరల కేకలువేసిరి. 14అందుకు పిలాతు–ఎందుకు? అతడే చెడుకార్యము చేసె నని వారి నడుగగా వారు–వానిని సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి. 15పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.
పరిశుద్ద దేవుని తిరస్కరించు వారు మరి ఆవిశ్వాసులు అవకాశం ఇచ్చిన ఎడల వారి హృదయపూర్వకముగా ఏం చేయడానికి ఇస్ట పడుదురు అని క్రింద వివరించబడి ఉంది.
- మత్తయి 27: 27అప్పుడు అధిపతియొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయనయొద్ద సైనికుల నందరిని సమకూర్చిరి. 28వారు ఆయన వస్త్రములు తీసి వేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి 29ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని–యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి 30ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి. 31ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొనిపోయిరి.
యేసుని చేతులకు మరి పాదములకు శిలువపై సైనికులు మేకులతో కొట్టిన తరువాత తండ్రి అయిన దేవుని యెడల యేసుని విజ్ఞాపనను దయచేసి జాగ్రత్తగా గమనించండి.
- లూకా 23: 32 మరి యిద్దరు ఆయనతోకూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు. 33వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతోకూడ సిలువవేసిరి. 34యేసు– తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి. 35ప్రజలు నిలువబడి చూచుచుండిరి; అధికారులును–వీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయినయెడల తన్నుతాను రక్షించుకొనునని అపహసించిరి. 36అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి 37–నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. 38–ఇతడు యూదుల రాజని పైవిలాసము కూడ ఆయనకు పైగా వ్రాయబడెను.
సత్యం: మానవ కులం మరి దెయ్యం వారి పిల్లలకు ఈ క్రింద ఉన్నటి దాని బోధించెదరు: “ ఇలా చెప్పబడినదాని మీరు విని ఉంటారు, ‘మీ పొరుగువారిని ప్రేమించు మరి మీ శత్రుని ద్వేషించు [మీ అత్యాశ ద్వారా మీకు కావాల్సిన దాని పొందకుండా చాలా మంది అడ్డుకుంటారు].’ [మత్తయి 5:43]
మన ప్రియ సృష్టికర్త తన పిల్లలకు దీనికి వితిరేకమైన దాని బోధించేను : మత్తయి:5:44నేను [యేసు] మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. 45ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. 46మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. 47మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా. 48మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
ఈ క్రింద ఉనది విషాదకరమైన సత్యం: నా హృదయము, మీ హృదయము మరి ప్రతి మానవ హృదయము వాస్తవికతముగా క్రింద ఉన్నదానిల కనబడుతుంది:
యిర్మీయా 17: 9 హృదయము [మానవుని] అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?
- మార్కు 7:18 ఆయన వారితో ఇట్లనెను– మీరును ఇంత అవివేకులై యున్నారా? వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? 19అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థములన్నిటిని పవిత్రపరచును. 20మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును. 21లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును 22నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. 23ఈ చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను.
ఈ ప్రపంచంలోనికి మొట్ట మొదటిగా జన్మించిన ప్రకృతికమైన చెడు మరి సకల ప్రజల క్రూరమైన హృదయము గురించి క్రింద వివరించబడిఉంది. ఇది యొక్క పాపపు ఫలము ఏదైతే పొరుగువారికి హాని కలిగించు పాపము నిండిన మానవ హృదయం:
- గలతీయులకు 5:19శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 20విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, 21భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
ఈ సత్యని మీరు చూసినరా? మనం అందరూ దోషులమే! దేవుని పరిపూర్ణమైన ప్రేమ నియమమును ఉల్లంగినచ్చినందుకు నేను దోషినే మీరు దోషులే:
మన దోషముల నిమిత్తం మనం ఏం చేయబోతునాము? దేవునికి మరి మన పొరుగువారికి వెతిరేకముగా ఒకసారి ఉల్లంఘన [పాపం] సంభవించాక, దాని చెడపడానికి కానీ మార్చడానికి కానీ కుదరదు. ఆ చర్య, ఆ పాపం, స్థిరమైనది మరి రాసిపెట్టబడినది, దానికి తీర్పు తీర్చబడాలి.
దేవుడు, ఎవరినైతే మీరు క్రూరమైనవారు అని విషాదకరముగా అనుకున్నారో, మీమాల్ని నన్ను మరి సకల మానవ కులమును చాలా ప్రేమించుతున్నారు అని ప్రకటించారు [అభిప్రాయవివరణము]:
“నేను నా సృష్టిని ప్రేమించుతాను, నా స్వంత స్వరూపమందు చేశాను. నా కుమారుడైన యేసుని స్వరూపాములో నేనే స్వయముగా వస్తాను వచ్చి నా పరిపూర్ణమైన ప్రేమ నియమమును ఉల్లంఘించినందుకు వారి తలుపున నేను న్యాయమైన మరణప్పు మూల్యని చెల్లించెదను.
నా కుమారుడు, యేసు స్వచ్చందముగా, సంతోషముతో అపహాస్యమును బరించి, ఉమ్మివేయబడి, చిత్రహింసలు అనుభవించి మరి ఆ కల్వరిలో శిలువ వేయబడి బహిస్కరించబడి ఎవరైతే ఆయనను నమ్మి విశ్వాసించుతారో వారి స్థానములో మరణించబడుతారు. ఆయనలో విశ్వసించు వారందరి పాపాల కొరకై యేసుని మరణం సంపూర్ణముగా మూల్యం చెల్లించింది అని నేను అంగీకరించుతాను. యేసుని మరణం వారికి బదులుగా చలించబడిఉండి మరి వారి సకల పాపము చెడు కప్పివేయబడిఉండి ఏదైతే వారికి వ్యతిరేకంగా తిరుగీ తీసుకురాను. ఎవరైతే యేసునిలో విశ్వాసించుతారో వారు పరలోకములో ఏ శిక్షావిధియు లేకుండా నా ముందు నిలబడుతారు [రోమా 8:1] మరి సంపూర్ణసంతోషము నిత్యము నాతో పరలోకములో జీవించుదరు” [కీర్తనలు 16:11].
ప్రియ స్నేహితుడా, ఇది ఎలాంటి లోతైన మరి నాణ్యత కలిగిన ప్రేమ, ఈ దేవుడు వారి సృష్టికర్త
ఆయన స్వంత కుమారుడిని చంపివేసిన కూడా మానవ కులమును ప్రేమించగలిగారు?
ఈ ప్రశ్నకు యేసుని స్వంత జవాబు:
- యోహాను 15:13 తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.
ఈ భూమి మీద ఇలాంటి ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరైనా మీకు తెలుసా? లేదు!
మీరు ఎవరినీ కనుగొనలేరు మిమ్మల్ని ఇలా ప్రేమించు పరిపూర్ణమైన దేవుని తప్ప! మరి మీ చీకటి మెదుటిలో మానవ క్రూరత్వమును మాత్రమే చూడగలుగుతారు మరి అలాంటి భయంకరమైన క్రూరత్వమును, ప్రేమలేని గుణమును చర్యలను మీ పరిపూర్ణమైన దేవునికి పోల్చుతారు.
దేవుని గురించి మీరు చెడుగా ఆలోచించాలి అని దయ్యం వల విసురుతాడు. ఆయన కుమారుడైన యేసుని ప్రేమించువారికి మన పరిపూర్ణమైన సృష్టికర్త ఏం వాగ్దానం చేశారని మనలను పరిశీలించుకోవాలి.
దేవుని పట్ల మరి మన పొరుగువారి పట్ల ఉన్న ఈ అపారమైన ప్రేమ మన స్వంత జీవితంలో ఎలా నిజముగా మరి క్రియాశీలమై మార్చబడుతుంది? మీరు మరలా క్రొత్తగా జన్మించబడాలి [ఆత్మికముగా]!
- యోహాను 3:3 అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను
మీకు నూతన “మానవాతీతమైన హృదయమును ఇవ్వబడాలి:
- యెహెజ్కేలు 36:26 నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను [ఆయన పట్ల మరి మీ పొరుగువారి పట్ల ప్రేమగల నియమముకు విధేయత చూపుటకు శక్తిని మరి దేవుని వాక్యమును గ్రహించే ఆత్మిక హృదయమును కలుగ చేసేదారు.]
నీ క్రొత్త జన్మ ఎలా జరుగును? గుర్తింప్పు! కటినమైన మరి దూషించబడిన హృదయమును పగలగొట్టడానికి ఇది పరిశుద్ధాత్మ నుంచి వచ్చు వరము: “నేను నిరాశ కలిగిన పాపిని. నన్ను నేను రక్షించుకొనుటకై ఏమి చేయలేను. నన్ను రక్షించుటకై నాకు వెలుపలి నుంచి ఎవరైనా కావాలి. నేను నా రక్షకుడైన యేసు క్రీస్తుని విశ్వాసించుతునాను! ప్రభువా నన్ను రక్షించు!”
- యోహాను 3:15 ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. 16దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 17లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. 18ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను. 19ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డైవెనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 20దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిం చును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. 21సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.
ఒక్కరు ఎప్పుడు నూతన ఆత్మిక హృదయమును పొంది ఉన్నారు అనడానికి ఆధారం ఏమై ఉంతుంది? నిశ్చయముగా ఇది సత్యమై ఉండాలి, మన రక్షకుడైన యేసుని లాగే దేవుని పట్ల మరి పొరుగువారి పట్ల ప్రేమను ఉత్పత్తి చేయగలము క్రింద ఉన్నది క్రీస్తు లాంటి ప్రేమను ఉత్పత్తి చేయు ఫలము:
గలతీయులకు 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
ప్రియ స్నేహితుడా, మీ పట్ల మా ప్రేమ యొక్క పుస్తకమును ముగించాలి.
ఈ యొక్క క్షణములో మీ యొక్క స్వేచ్ఛా సంకల్పం తో మీరు యేసుని తిరస్కరించినప్పటికీ, ఈ అగాధమైన ప్రేమను మీకు సరైన విదములో ప్రకటించదము.
యేసు క్రీస్తు గురించిన సత్యం మరి అందమును పరిశుద్ధాత్మ మీకు బయలుపరచుటకై సంతోషించుతారు ఏదైతే మీ కటినమైన హృదయమును పగలకొట్టి మిమ్మల్ని ఆయని పరలోకప్పు శాశ్వత కుటుంబం లోనికి తీసుకువస్తు యేసుని ప్రేమతో మీ హృదయాలను స్వస్థ పరచాలి అని మీ కొరకై మా ప్రార్థన.
అవును, ఈ ప్రస్తుత చెడు కలిగిన ప్రపంచంలో, అన్నీ చోటులనుంచి మానవ హృదయానికి మరి మనసుకు చెడు యుద్దని గెలచినట్టు ఉంతుంది. కానీ ఇది యొక్క మోసం ఇది బాధాకరమైన సత్యం. దేవుడు తన పరిపూర్ణమైన ప్రేమ ద్వారా మానవ కులమును చెడు మరి నొప్పి నుంచి ఆయనకు శాశ్వతమైన కుటుంబంలోనికి నిత్యము ఆనందించడానికి కార్యము నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ యొక్క అద్బుతమైన చర్యను ఒక సమయంలో ఒక హృదయం అని చేస్తునారు.
యేసు తన సృష్టిని తిరుగి పరిపూర్ణమైన శాంతి మరియు సామరస్యం లోనికి తీసుకెళ్లడానికి త్వరలో ఈ భూమికి తిరుగి వస్తున్నారు. ఈ భూమి ఆదమ్ మరి హవ్వా ఆయనకు తిరుగుబడక ముందు ఉన్నటువంటి ఏదేను తోటకు తీసుకెళ్తారు. ఈ తిరుగుబాటు పాపపు- రోగముకు జన్మ ఇచ్చింది ఆ క్షణమునుంచి ప్రతి మానవుని చంపి పరిశుద్దమైన దేవుని మరి వారి పట్ల ఆయనకు ఉన్న పరిపూర్ణమైన ప్రేమను తిరస్కరించుచుండగా ఊహించలేని నొప్పి మరి బాధ కలిగింది.
మీ ప్రశ్నల కొరకై మీకు కృతజ్ఞతలు. మా ఆలోచనల ద్వారా మీ సృష్టికర్త అయిన ప్రేమగల యేసు క్రీస్తుని నిజముగా చూడడానికి కొంత స్పస్టత వచ్చినట్టుగా విశ్వాసించుతునము ఎవరైతే ఒక రోజు త్వరలో మరణమును మరి నప్పిని నాశనపరచుతారో వారికి మీ జేవిత కాలమంత ఋణపడిఉన్నారు.
- ప్రకటన 21:3 అప్పుడు – ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును. 4ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. 5అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు–ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు–ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.
మేము క్రీస్తునిలో అనేక సోదరులు మరియు సోదరీమణులతో కలిసి ప్రార్థన చేసేదము:- ప్రకటన 22:20 ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు–అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్; ప్రభువైన యేసూ, రమ్ము!
మీకు సహాయ పడేల కొంత సమాచారమున జత పరచాము. మీకు ఇంకా ప్రశ్నలు ఉంటే మరి మీకు ఆశ ఉంటే మాతో మీ సంభాషణమును కొనసాగించండి.
క్రీస్తునిలో, మరింత ప్రేమతో –
జోన్ + ఫిలిస్+ స్నేహితులు @ WasItForMe.com