యేసు దేవుడు – మనిషి, నిజముగా దేవుడు మరి నిజముగా పరిపూర్ణమైన మనిషి.
కుమారుడైన దేవుడు, యేసు దేవత్వము తండ్రి, కుమారుడు మరి పరిశుద్ధాత్మలో ఒక బాగముగా ఉన్నప్పటికీ, కన్య మరియకు జన్మించినప్పుడు ఆత్మలో తన తండ్రి యొక్క వక్షస్థలం ఎప్పటికీ వాదలలేదు. తన యొక్క శాశ్వతమైన అస్తిత్వానికి మరి స్థానమునకు యేసు శరీరధారి ఆయెను.
యోహాను 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.
లూకా 1:37 “దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదని.”
కుమారుడైన దేవుడు మరణించలేరు, కానీ యేసు, పరిపూర్ణమైన మనిషిగా చనిపోయారు. ఆయన తన పరిపూర్ణమైన మరణప్పు యాగమును పూర్తి చేసి మరి అతని తుది శ్వాస విడిచారు, యేసు, కుమారుడైన దేవుడు, అతని శాశ్వతమైన దేవత్వముగల ఆత్మను మరలా పరలోకముకు అతని శాశ్వతమైన ఇంటిలోనికి తిరుగి వదిలేశారు.
యోహాను 19:30 యేసు ఆ చిరక పుచ్చుకొని–సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను.
ఆ యొక్క క్షణము, యేసుని శారీరము పని చేయడం ఆపివేసింది, అతని హృదయము సంపూర్ణ దేహముకు రక్త ప్రవాహమును ఆపివేసింది మరి మెదటి తరంగము ఆగిపోయింది.
శిలువలో నుంచి యేసుని దేహమును కిందకు తీసుకువచ్చి, నారబట్టలు చుట్టి, మరి రాలతో చక్కబడిన ఉపయోగించని యొక్క సమాధిలో పెట్టారు.
- యోహాను 19:38-42 అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము కూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందునవారు అందులో యేసును పెట్టిరి.
మూడు రోజుల తరువాత, తండ్రైన దేవుడు, యేసుని మృత దేహములోనికి మరలా జీవమును పంపించి మరి మృతలనుండి పునరుతాన శక్తితో ఆయనను లేపేను.
- లూకా 24:1-7 ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్ర్తీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి సమాధిముందర ఉండిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరు–సజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు –మనుష్యకుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అనిరి.”
ప్రభువు ప్రవక్తయిన యెహెజ్కేలు యే శక్తితో దర్శనములు కలిగించెనో మనకు దేవుని అపరితమైన
సార్వభౌమాధికారం గురించి, సృజనాత్మక పునరుతాన శక్తిని వివరించారు.
యెహెజ్కేలు 37
1 యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా 2యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. 3ఆయన–నర పుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగా–ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని. 4అందుకాయన–ప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము–ఎండిపోయిన యెముకలారా, యెహోవా మాట ఆలకించుడి. 5ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను; 6చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. 7ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. 8నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక పోయెను. 9అప్పుడు ఆయన–నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా– జీవాత్మా, నలుదిక్కులనుండివచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము. 10ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి. 11అప్పుడాయన నాతో ఇట్లనెను –నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు – మన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతిమి అని యనుకొనుచున్నారు 12కాబట్టి ప్రవచన మెత్తి వారితో ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోనుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలుదేశములోనికి తోడుకొని వచ్చెదను. 13నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా 14నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.
విశ్వాసములో ఆయన పిల్లలైన మనకు దేవుడు యేసుని పరలోకములోనికి ఆయనతో పాటు పరిపూర్ణమైన సంతోషములోనికి ఎలా తీసుకెలారో మన విషయములో కూడా అదే చేస్తారు.
- 1 కొరింథీయులకు 6: 14 దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తివలన లేపును
- రోమా 4:20-25 అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. 23అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడ వ్రాయ బడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
ఈ యొక్క ఎప్పుడు చెప్పని గొప్ప ప్రేమ కథను చెప్పడం ద్వారా మేము తాకిన ప్రతి ఒకరి కొరకై మా ప్రార్థన! యేసు క్రీస్తునిలో విశ్వాసించాలి అని. యేసునిలో నమ్మకం మరి విశ్వాసం మనకు పునరుత్థాన శక్తి తెరవబడుతుంది దేవుడు మనలను మృతలనుండి లేపి మనకొరకై సిద్దపరచిన పరలోకములోనికి తీసుకెళ్లడానికి సాధకము చేయును.
యోహాను 14:1-6 “మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరునుఉండు లాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసి కొని పోవుదును. నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను. అందుకు తోమా– ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
మా మరింత ప్రేమతో
జోన్ + ఫిలిస్ + WasItForMe.com కుటుంబం