యేసు క్రీస్తు మంచివాడు అని నాకు తెలుసు, కానీ మనుషులు కాదు, అందుకోరకై నాకు చర్చికి వెలడం ఇష్టం లేదు. మీ అభిప్రాయం ఏంటి?
మీ హృదయంలో కలుగుతున కలహాలుగురించి మేము గ్రహించగలము. మీ అన్నీ కళహములు తీర్చడానిక్కి మీరు కచ్చితంగా ఈ నాలుగు రకమైన పరీక్షలో పాల్గొనాలి.
- యేసు దేవుని కుమారుడా?
- ఆయన మాటలు నిరంతరమైనవి మరియు ప్రతి మనిషికి వాటి ద్వారా తీర్పు తీర్చుబడుతుంది అని యేసు చెప్పాడా?
- సత్యవేదము ప్రేరణ పొందినదా, తప్పుపట్టలేని నిజమై ఉనదా లేక ఇది పూర్తిగా అబద్ధంమ?
- దేవుని ఘనపరచుటకు, మహిమపరచుటకు మరియు ఒకరినొకరు ప్రొస్థహించుటకు నేను మరొక్క క్రీస్తువునితో కలిసి సభకు వెళ్ళి సత్యవేదంలో ఉన్న భోదనను పూర్తిగా పాటించుతాన?
సత్యవేదములో ఉన్న వచనములను ఏనుకొని దాని పాటించడానికి లేక ధాని ఉల్లంఘించడానికి ఒక్కరు ధైర్యం చేయరు. మీ అన్ని ప్రశ్నలకు ఈ క్రింద ప్రేరణ పొందిన, తప్పుపట్టలేని నిజం జవాబు ఇస్తుంది.
సందర్భం: యేసు పరిపునమైఉనాడు, ఇంకా ఆయన ప్రజల మద్యలో ఉండాలి అని ఆశిస్తారు. ఆయన ప్రజలను ప్రేమించారు. వారినుంచి ఉత్తమమైనది కోరుకుంటారు. ఆయనను ఈ ప్రజలు త్యజించి తిరస్కరించూతారని ఆయనకు తెలుసు. ఆయనను బందిస్తారని, అపహాస్యం చేస్తారని, దూషిస్తారని, చిత్రహింస పెట్టి శిలువ పైన వేసి ధారణముగా చంపడానికి కుట్ర పండుతారని ఆయనకు తెలుసు.
వాస్తవం: ఇక ఇలాంటి చాలా కష్టతరమైన వేదన సమయంలో యేసు ప్రజల గురించి ఇలాగ ప్రకటిస్తారు: – లూకా 23:34 యేసు– “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.” వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.
వ్యక్తిగత అన్వయము: యేసు మానవ కులాని ప్రేమించాడు, ఆయన సృష్టి కొరకై ఎలాంటి నాణ్యతా లేని ప్రజల కొరకై తన ప్రాణమును ఇవడానికి ఇచ్చించారు, పరీషుదాత్మ మనకు చెప్పినటుగా ఒకరి తో ఒకరు కలిసి దేవుని ఆరాధించమనీ ఆజ్ఞగా మరియు యేసు క్రీస్తు పైన మనకు ఉన్న ప్రేమను వివరించడానికి చెప్పినపుడు , ఆయనను వెంబడించువారైనా మనము, మరొక పాపిని అనుగా మన ప్రభువు, రక్షకూడిల పరిపూర్ణంగా లేరు అని వారిని కలవడానికి లేక ముట్టుకోలేనంత స్వార్థపరులైఉనామ?
సత్యం: యేసు క్రీస్తు పట్ల మనకు ఉన్న ప్రేమను వ్యక్తిగతముగా చూపించడానికి ఒకటే దారి ఆదేమనుగా, మనలాను ప్రేమించునట్టు “మన పొరుగువారిని ప్రేమించడం” (మత్తయి 19:19). ఒకరిని వ్యక్తిగతముగా కలవకుండా మన ప్రేమను చూపించడం అసాధ్యం. ఒకరి హృదయం లో యేసు ప్రభుమీద ఉన్న ప్రేమను పరీషుదాత్మ్ అజ్ఞాపించినట్టు ఒకరినొకరు కలిసి ఆ ప్రేమను చూపించడం నిజమైనా పరీక్షగా ఉంతుంది.
- హెబ్రీయులకు 10:24-25 కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము
- లూకా 6: 46- 49 నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక– ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి, నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియ జేతును. వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలియుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టినవానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పడెను; ఆ యింటిపాటు గొప్పదని చెప్పెను.
- యోహాను 12:47-49 ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండినయెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.
- యోహాను 14:23-24 యేసు–ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే.
మీరు సరైన సత్యవేద భోదన చేసే సభకు వెళ్ళినపుడు, ఈ వచనమును పాట్టించడం మంచిది
అపొస్తలుల కార్యములు 17:11 “వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.”
మనం ఏం వింటున్నామో అది మన గ్రంథంలో ఉన్న లేఖనలకు సరిగా ఉందా అని పరిశోధించూడము మన భాద్యత అయింది.
మీకు స్పస్తంగా అర్థం అవడానికి ఇది మీకు సహాయం చేసింది అని మేము నమ్ముతునాము. మీ ప్రశ్నలను మేము ఆహ్వానిస్తునాము మరియు అన్నిటికీ సరైన జవాబు ఇవడానికి ఈ అవకాశమును సంతోషముగా స్వీకరిస్తున్నాము.
మరింత ప్రేమతో, క్రీస్తు నామంలో-
జోన్+ఫిలిస్ +మరియు స్నేహితులు @ WasItForMe.com