సువార్త వినకుండా మరణించిన మన పూర్వీకుల గమ్యం ఏంటి?
జవాబు: సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు – ఆదికాండము 18:25.
సత్యం : మన గతం గురించి మనం ఏమి చేయలేము, లేక మరొక్కరి గతం గురించి కూడా మనం ఏమి చేయలేము! సత్యం ఏంటి అంటే మనకు ఈ యొక్క ప్రస్తుత క్షణంలో మాత్రమే నియంత్రన కలిగి ఉంటుంది, దేవుడు ఆజ్ఞాపించినట్టు ఇప్పుడు యేసు క్రీస్తునిలో విశ్వాసించడానికి ఎంచుకోవాలి లేకపోతే లేదు.
మత్తయి 17: 5 “ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని!”
మన పూర్వీకుల లేక గత తరంగురించి కానీ మనం ఏమి చేయలేము. మన పరిపూర్ణమైన సృష్టికర్త చేత వారిని వదిలేయవలెను ఎవరైతే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ పరిపూర్ణమైన ప్రేమతో, కరుణతో, మరి న్యాయముతో సంపూర్ణంగా వ్యవహరించుతారు.
మీరు మరి నేను మరి ఎవరైనా కానీ ఈ సత్యని చదవడం కానీ విని ఉంటారో వారు యేసు క్రీస్తుని వ్యక్తీకథముగా విశ్వాసించారు అని తెలుసుకోవడం ఆనంతముగా మరి శాశ్వతముగా చాలా ప్రముక్యమైనది. ఇది మనం ఎదురుకునే యొక్క ప్రముక్యమైన ప్రశ్న మాత్రమే కాదు, కానీ మనం దేవుని కుమారుడి గురించిన సత్యని విశ్వసించడం లేక తిరస్కరించడం గురించిన ఎంపిక ఇది మన పిల్లలపై మరి మన భవిష్యత్తు తరంముపై పెద్దగా ప్రభావితం చూపుతుంది.
సకల రీతిలో మరియు అతని సకల గుణములు దేవుడు పరిపూర్ణుడు. ఆయన కరుణా మరి నీతి ఎలా పరిపూర్ణమై ఉన్నదో అలగునే ఆయన ప్రేమ న్యాయముగా ఉనది. మానవ కులముతో మరి దూతలతో వ్యవహరించినప్పుడు పరిపునమైన ప్రేమ, కరుణా మరి న్యాయమును అనువర్తించకుండ వ్యవహారము చేయడం దేవునికి అసాధ్యము.
యోబు పుస్తకము సంకలనం మరి సమీకరించబడిన గ్రంథాలలో మొత్తమదటి వ్రాత అని అనేకులు విశ్వాసించుతారు.
తప్పిపోయిన స్త్రీ మరి పురుషుల విమోచన, సమన్వయం మరి రక్షణ పట్ల దేవుని ప్రణాళికను మరి దేవుని గురించి యోబు ఏరిగి ఉన్నాడు. యోబుకు ఎలా తెలుసు? దేవుడు తన సృష్టిని, నైతిక భావమును ప్రకటించిన విదముగా [- రోమా 1:20 ] మరి మెల్కీసెదెకు లాంటి
పురుషుల మూలముగా [-ఆదికాండము 14:18 ].
ఆదికాండము 3:15 లో దేవుడు రాబోవు విమోచకూడి గురించిన సత్యమును ప్రకటించేను మరి మానవ కులముకి ఈ సత్యని ప్రకటించడం ఆపలేదు.
యోబు తన అవగాహమును స్పష్టముగా ప్రకటించేను: యోబు 19:25అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును; 26ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను,
దేవుడు అబద్ధమాడజాలడు. ఆదమ్ మరి హవ్వా వారి నుంచి సకల ప్రజలు మరి సకల తరములకు రోమియులకు చెప్పిన విదముగా సత్యమై ఉనది. – రోమా 1: 20 ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.
పౌలు పరీషుదాత్మ మూలముగా రోమా 10:17 -18 లో ప్రకటించేను: కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును 18 అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను.”
-రోమా 1:18-25 దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది. 19ఎందు కనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగములవరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్.
అందువలన, మా మదూరమైన శ్రోతలలారా, మన సకల పూర్వీకులు యోబుతో సహ, సొదొమ మరి గొమొఱ్ఱా ప్రజలతో సహ, మరి మీ పూర్వీకులు ఈ రోజు ప్రతి మనిషికి ప్రతి హృదయము పట్ల ఉన్న దేవుని ప్రకటనను ఏదైతే మీరు చూచి వినుచున్నారో దానికి బాధ్యతకలిగి ఉన్నారు.
అబ్రహం ఎప్పుడైతే లోతు నివసించు పట్టణమును ప్రభువు నాశన పరచెదరని ఎరిగిన యెడల తన మేనల్లుడైన లోతు గురించి ప్రభువును ప్రార్థించేను.
- ఆదికాండము 18:24-28 ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానిలోనున్న యేబదిమంది నీతిమంతులనిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతోకూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా–సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను అందుకు అబ్రాహాము–ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువై నందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన–అక్కడ నలుబదియైదుగురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను; అతడింక ఆయనతో మాటలాడుచు–ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ నలుబదిమందిని బట్టి నాశనముచేయక యుందునని చెప్పగా.”
పదిమంది ఆత్మలుకు తగ్గే వరుకు అబ్రాహాము ప్రభువుతో ఆయన దయకొరకై విజ్ఞాపించూచు కొనసాగెను. ఆ సొదొమలో పదిమంది నీతిమంతుల కొరకై అబ్రహాము తార్కికం చేయగలిగాడ?
ఆదికాండము 18: 32-33 అతడు–ప్రభువు కోపపడనియెడల నే నింకొకమారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ పదిమందినిబట్టి నాశనము చేయక యుందుననెను. యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.
- ఆదికాండము 19:12-17 అప్పుడామనుష్యులు [దుతులు] లోతుతో–ఇక్కడ నీకు మరియెవ రున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొని రమ్ము; మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి; వారినిగూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్ప దాయెను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాటలాడి–లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్లదృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి–లెమ్ము; ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసికొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతనిమీద యెహోవా కనికరపడుటవలన ఆ మనుష్యులు అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయటనుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసికొని వచ్చిన తరువాత ఆయన–నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా.”
- 2 పేతురు 2:6-8 మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారిమధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, (వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను)-
- ఆదికాండము 15:6 అతడు [అబ్రాహాము] యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను
- గలతీయులకు 3: 8-9 దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి– నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతోకూడ ఆశీర్వదింపబడుదురు.
మీరు యేసుని నమ్మి విశ్వాసించుతార? మీ పిల్లలు మీకు మరి మాకు విలువైనవారు. యేసుని విశ్వసించుటకై మీ పిల్లలకు బోధిస్తార?
మీరు యేసు గురించి మీ పిల్లలకు చెప్పినత్తయితే మరి వారు ఆయనలో విశ్వాసించినటాయితే, మీ యొక్క శారీరిక మరణము తరువాత మీ భవిష్యత్తు తరం గురించి ఆలోచించవలసిన అవసరత లేదు. మీరు పరలోకములో ఉనట్టు వారికి తెలుస్తుంది!
మీ మరణం తరువాత పౌలు తో పాటు కృతజ్ఞత చెప్పునట్టు మీ కొరకు ప్రార్థన చేస్తాము:
- 2 తిమోతికి 4:7-8 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.
చదవండి: నేను విశ్వాసించుతునాను!
క్రీస్తునిలో, మా మరింత ప్రేమతో – జోన్ + ఫిలిస్ + స్నేహితులు @ WasItForMe.com