యేసు కన్నీళ్లు విడిచెను? యోహాను 11:35
యేసు కన్నీళ్లు విడిచెను
“యేసు కన్నీళ్లు విడిచెను!” – ఈ ప్రకటన ఒక ముఖ్యత్వం ఏంటి?
యోహాను 11:33-35 ఆమె ఏడ్చుటయు, ఆమెతోకూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు–అతని నెక్కడ నుంచితిరని అడుగగా, “వారు–ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను.
ఏడ్చుట లేక కన్నీళ్లు విడిచుట, అనడం సంతోషం మరియు బాధ కలిగినప్పుడు అధికమైన భావోద్వేగంములతో ప్రతిస్పందించే మానవల స్వభావం. కన్నీళ్లు విడిచుట అనడం ప్రతి మానవ జాతిని ఒక్కటి చేర్చు ఒక సాధారణమైన అతి ప్రముక్యమైన భావం.
యేసు ఒక దేవుడు-మనిషిగా, కన్నీళ్లు విడిచేను. పాపము మనుషులలోని రక్తం ప్రవాహమువలె ప్రవేశించింది కాబట్టి ఈ మానవ సృష్టి ఒక దుస్థితిని చూచి కన్నీళ్లు విడుచుతున యేసుని ప్రేమ మరియు ఆయన కరుణా గురించి ఇక్కడ వర్ణిస్తుంది. ఆదాము మరియు హవ్వ వారి ఆవిదేయత్వంవలన మరియు ఊదేశపూర్వకముగా దేవుని ఆజ్ఞను తిరస్కరించినవలన, పాపం ఎప్పుడైతే ఈ లోకంలోనికి ప్రవేశించిందో అప్పుడే సకల మానవ కులానికి సత్తతముగా నొప్పిని, దుఃఖమును, మరియు బాధను ఉత్పత్తి చేసింది.
మీ సృష్టి కర్తయిన యేసునిలో విశ్వాసించి వెంబడించినప్పుడు, మీరు గ్రహించార ఈ నొప్పి నిండిన ప్రాపంచిక జీవితంలో యేసు మీతో పాటు కన్నీళ్లు విడిచును అని?
- (హెబ్రీయులకు 4: 13-15) మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
- (మత్తయి 8: 16-17) సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. ఆయన మాటవలన దయ్యములను వెళ్ల గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.
- (యోహాను 11: 33-44) ఆమె ఏడ్చుటయు, ఆమెతోకూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు–అతని నెక్కడ నుంచితిరని అడుగగా, వారు–ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు–అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు–ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి. యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను. యేసు–రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త–ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు–నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి–తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. ఆయన ఆలాగు చెప్పి–లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు– మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.
సర్వజ్ఞుడైన యేసు, గత, వర్తమానం, మరియు భవిష్యత్తు సమస్తం తెలిసి కన్నీళ్లు విడిచెను.
ఆయనని నమ్మి, విశ్వాసించి, వెంబడించడానికి తిరస్కరించినవారి అంతంలేని నప్పిని, బాదను ముందుగా సమస్థాని యేసు చూసారు. యేసు కన్నీళ్లు విడిచెను ఎందుకంటే, ఎవరైతే వారి స్వేచ్చమైన సంకల్పంతో ఆయనను ప్రేమించి మరి వెంబడించడానికి ఎంచుకుంటారో వారికి మాత్రమే పరిపూర్ణమైన సంతోషంతో నిత్య జీవాని అనుగ్రహిస్తారు. ఊహించుకోండి, పరలోకంలో కన్నీళ్లు లేదు!
మీరు యేసుని తిరస్కరించితే, ఆయన ఇంకా కన్నీళ్లు విడుచుతారు, కానీ, ఆయన మీ కొరకై కన్నీళ్లు విడుచుతారు ఎందుకంటే మీరు నరకం అను శాశ్వతమైన నప్పి దుఖం ఉన్న విషాదకరమైన గమ్యాన్ని చేర్చు దారిని సత్తతముగా ఎంచుకునారు.
- లూకా 19:41-44 ఆయన [యేసు] పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి –“నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి. (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతోకూడ నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.”
ఈ భూమి మీద సకల మానవ కులం వారి జీవిత కాలంమంత బాధపడాలీ. కొన్ని సార్లు ఇతరీ క్రియల వలన బలవంతముగా బాధన అనుభవించాలి, ఎప్పుడైతే దేవుని తిరస్కరించి లేక బహిష్కరించినపుడు మనం తీసుకున్న తప్పు నిర్ణయాల ఫలితం వలన మనకు ఎక్కువ కన్నీళ్ళు కలుగుతుంది. తప్పకుండా మన ప్రతి పాపము బాద నిండిన పరిణామాలను ఉత్పత్తి చేస్తుంది.
ఒకే ఒక అత్యున్నతమైన నిర్ణయం ఈ భూమి మీద మన కన్నీళ్ళు మరి బాధ వ్యర్థముగా పోదు అని హామీ ఇస్తుంది. అది ఏమయిఉంటుంది? ప్రబువాయిన యేసు క్రీస్తు ఎలాంటి వారినైనను రక్షించవచ్చు! ఈ సత్యాని ఎదురుకునప్పుడు ఫిలిప్పియన్ జైలర్ ఈ యొక్క నిర్ణయని తీసుకునారు
- అపొస్తలుల కార్యములు 16:29-34 అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు– “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి” అతనికి అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనముపెట్టి, దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను.
ఈ ఒక నిర్ణయం ఈ భూమి మీద మరలా కన్నీళ్ళు విడువము అని హామీ ఇవ్వలేదు కానీ మరణం తరువాత ఒక చుక్క కన్నీళ్ళు రాదు అని అతనికి అతని కుటుంబ సబ్యులకు హామీ ఇవబడింది మరియు ప్రబువు రక్షకుడైన యేసు క్రీస్తునితో పాటు పరలోకనికి ఎత్తబడుతారు.
- ప్రకటన 21:3-4 అప్పుడు – ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
యేసుని కుటుంబం పరలోకంలో కన్నీళ్ళు లేకుండా ఉన్నారు అని భరోసా ఏంటి?
గెత్సెమనే తోటలోన యేసు దేవుడు-మనిషి కన్నీళ్లు విడిచెను. అతను బలపరిచబడినప్పుడు, ఆయనను వేరుపర్చి, శిలువ వేయబడ్డారు. ఆయన మరణమూవలన, ఎవరైతే ఆయనలో నమ్మి విశ్వాసించి మరి వెంబడిస్తారో వారి ప్రతి పాపము యేసు యొక్క పరిపూర్ణమైన మనిషి ద్వారా మూసివేయబడినది. హెబ్రీయులకు 6:18 ఈ ఒక మాటలతో హామీ ఇస్తుంది, “తాను అబద్ధమాడజాలని”.
లూకా 22:41-44 వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్త మైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.
యోహాను 19:30 యేసు ఆ చిరక పుచ్చుకొని–సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను (అతని దేహము మరణించింది).
యేసు మరణించారు కాబట్టి మనం మరలా పరిశుద్ద దేవుని దెగ్గరికి చేరగలము మరియు మన కంటి నుంచి ప్రతి కన్నీళ్లను ఎప్పటికీ తుడిచివేయబడినది.
మీకు మరి నాకు యే నిర్ణయం తీసుకోవాలి అన్న అవకాశం ఇవ్వబడిఉంది. మన పాపములకు పలితముగా మరణం పొందవలసిన మనకు బదులుగా యేసుని కన్నీళ్ళు మరి మరణాని కృతజ్ఞతతో అంగీకరిస్తామ?
ఎవరైనా సరైన ఆలోచనతో ఇలాంటి యేసుని ప్రేమను త్యజించగలమ?
యేసు క్రీస్తుని నమ్మి, విశ్వాసించి, ప్రేమించి, మరియు వెబడిస్తార?
క్రీస్తునిలో, మరింత ప్రేమాతో.
జోన్ +ఫీలిస్+ స్నేహితులు @ WasItForMe.com
వీడియొ వీక్షణకు:
దేవుని ప్రేమ – https://vimeo.com/912288970
నేను విశ్వాసించుతునాను! https://wasitforme.com/i-believe/