ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోతారు అని మీరు నమ్ముతార? వ్యక్తిగతంగా, మీరు కూడా ఒక రోజు చనిపోతారు అని నమ్ముతార? మీరు చెనిపోయాక , మీకు ఏం జరుగుతుంది? ఎక్కడికి వెలుతారు? పరలోకం మరియు నరకం అనేది ఉంది అని మీరు నమ్ముతార? పరలోకం అనేది ఉన్నటు మీరు విశ్వాసించితే, మీ నిత్యత్వాని గడపడానికి అక్కడకి వెళ్ళడానికి మీకు ఎందుకు అనుమతించాలి?
ఈ అన్నీ ప్రశ్నలకు మీరు సమాధానం ఇచ్చునటాయితే, “ఎందుకు?” అన్న మీ స్వంత ప్రశ్నకు సరైన జవాబు ఇవడానిక్కి నిశ్చయమైన పునాది కట్టుకోగలరు.
సత్యం : పరలోకం అనే ఒక ప్రదేశంలో మీరు విశ్వాసించినటాయితే, అక్కడికి ప్రవేశించడానికి మీరు యేసు అనే ఒక్క మనిషిలో విశ్వాసం ఉంచాలి. మీరు యేసులో విశ్వాసం ఉంచినటాయితే, మీరు కల్వరి అని ఒక ప్రదేశంలో కూడా విశ్వాసించయిఉంటారు, ఎక్కడైతే యేసుని శిలువ మీద వేశారో అక్కడ ఆయన ప్రాణ త్యాగం చేశారు అంధువలన ఎవరైతే ఆయనలో విశ్వాసించుతారో వారు ఎప్పటికీ పరలోకంలో ఆయనతో పాట్టు జీవిస్తారు.
మన పాపము కొరకై యేసు చెనిపోవడం ఎందుకు అవసరముగా ఉనది? పడిపోయినవారికి ఆయన మరణం ఒక్కటే దారై ఉంటుంది, పాపముతో-నిండిన స్త్రీపురుషులు పరీషుదమైన దేవుని ప్రేమగల కుటుంబంలోకి మరలా ఏకీభవించవచ్చు.
పరిపూర్ణమైన పాపము లేని దేవుని కుమారుడు మనకు బదులుగా ఆ శిలువపైన తన రక్తాని చిందించిన ఆ ఘటనలో పరిపూర్ణమైన తీర్పు, మరియు పరిపూర్ణమైన ప్రేమ కలిసి ఉంది. మన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి యేసుని పరిపూర్ణమైన జీవితం మరియు మరణము సరిపోతుంది అని పరీషుదమైన దేవుడు అంగీకరించారు మరియు రుజువుగా మూడు రోజులు తరువాత యేసుని సమాధి నుంచి లేపారు.
సత్యం: దేవుడు ఈ ప్రపంచాని కీడుగా, అన్యాయంముగా, వివక్షము కొరకై, బాధకొరకై, కన్నీటి, మరణము కొరకై సృష్టించ లేదు! మనం నివసించు ఈ భూమీ ప్రస్తుతం బాద నిండి ఉండడానిక్కి కారణం పరీషుదా దేవునికి ఎదురుగా మనిషి ఒక పాపం మరియు వారి తిరుగుబాటు. ఈ ప్రస్తుత ప్రపంచం దేవుని తప్పు కాదు, మరణాంతకమైన పాపమనే భయంకరమైన అంటురోగం ప్రవేశించాక పరిపూర్ణమైన సృష్టికర్తను ప్రేమించడం కాగా ఆదాము మరియు హవ్వ వారిని ప్రేమించి మరియు వారి స్వంత పాపపు ఆశయాలతో ఈ తప్పు జరిగింది.
దేవుడు పరిపూర్ణమైన ప్రపంచాని సృష్టించారు అది దేవుని దోషంలేని మాటలు ద్వారా మనం చదవీవున్నము . మంచిదిగాను మరియు సంతృప్తిగాను ప్రియమైన మానవ సృష్టి కొరకై ప్రత్తిది వదగించారు. ఆయన మనిషిని ఆయన స్వరూపంలో చేసి వారి హృదయంలో నిత్యత్వాని ఉంచేను.
- ప్రసంగి 3: 11 దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.
ప్రతి ఒక్కరూ ఒక శాశ్వతమైన స్థలం లో జీవించాల్సివుంతుంది. సత్యవేదము ఈ రెండు స్థలములను అది పరలోకం లేక నరకం గురించి వివరిస్తుంది.
- ఆదికాండము 1 :26-28 దేవుడు–మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా–మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
- ఆదికాండము 2:8-9 దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను.
ఏం జరిగింది?
ఆదాము + హవ్వ దేవునికి అవిధేయత చూపించారు. దేవుడు ప్రకటించినట్టు ఆయన పరిపూర్ణమైన తోటలోనుంచి పరిపూర్ణమైన పరీషుద దేవునినుంచి వేరుపరిచే ఒక పాపమును చేశారు.
- ఆదికాండము 2: 15-17 మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేపుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను (పరీషుదామైన దేవునినుంచి వేరుపరచబడడం).
దేవుడు ఎప్పటికీ నిజంగా ఉంటారు మరియు అబద్దం చెప్పలేరు. ఆదాము + హవ్వ దేవునికి అవిధేయత చూపించినపుడు, మనం చదివినట్టుగా వారి తిరుగుబాట్టువలన మరియు అవిధేయతవలన దేవుడు ఒక పరిపూర్ణమైన న్యాయమూర్తిగా న్యాయమైన శిక్షను ప్రకటించారు.
- ఆదికాండము 3:16-19 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో–నీవు నీ భార్యమాట విని–తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు; నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
ఈ రోజు వరకు సకల మానవ కులానికి ఇది నిజమైఉనది. అందువలన మానవకులం నిత్యముగా బాదలోనికి, శ్రమలోనికి మరియు దుక్కములోనికి త్రోసివేయబడ్డారు. పరీషుదమైన దేవునికి వెతిరేకముగా మన పూర్వీకులైన ఆదాము + హవ్వల అవిధేయత మరియు తిరుగుబాట్టు లాగే, మనమందరు దోషులమే.
దేవుడు పరిపూర్ణమైన పరీశుద్ధుడు న్యాయముకలిగినవాడు మాత్రమే కాదు. ఆయన పరిపూర్ణమైన కరుణ మరియు ప్రేమకలిగినవాడు. ఆయన అద్బుతమైన మానవ సృస్టీని రక్షించడానికి దేవుడు ఏం చేశారు? ఈ పరీపురణమైన పరిశుద్ద సంబంధంలోనికి పడిపోయిన మానవకులని పునఃస్థాపించడానిక్కి ఒక ప్రణాళికను స్థాపించాడు. ఈ పునఃస్థాపన ప్రణాళికను మనం రక్షణ సువార్త శుభవార్త అని అంటాము.
ఈ రక్షణ ప్రణాళికా ఎలా ఉంటుంది?
ఇది సులభంగా చెప్పాలి అంటే: పరిపూర్ణమైన తోటనుంచి, శిలువ మార్గం ద్వారా పరిపూర్ణమైన నగరానికి ఈ మద్యలో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తము చెనిపోయాడు.
- యెషయా 65:17 ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు.
- ప్రకటన 21:1-4 అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు – ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
- ప్రకటన 22:1-5 మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షముయొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియో గించును. ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనముచేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును. రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
వాస్తవానికి, ఇది ఒక ప్రశ్నను తెస్తుంది: “ దేవుని రాజ్యం లోనికి మరియు ఆయన పరిపూర్ణమైన సృష్టిలోనికి ఎలా ప్రవేశం గెలుచుకోగలము?”
సత్యవేదము చెప్పినట్టు మనం ఈ ప్రవేశమును ఏదోఒకటి చేసి గెలుచుకోలేము. పాపమువలన కలిగిన పరిశుద్దమైన దేవుని కోపాన్ని మన చర్యలవాలన శాంతపరచలేము. యేసు క్రీస్తునిలో విశ్వాసించి మరియు నమ్మడం ద్వారా మనం ఈ ద్వారములోనికి ప్రవేశించవచ్చు.
- యోహాను 14:6 యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
- రోమా 5:6-11 ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను. నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును. అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. బట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము.
- యోహాను 1:11-13 1ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.
“ఆయనను స్వీకరించడం” అనుగా ఏంటి? స్వీకరించు అనుగా, యేసు క్రీస్తునిలో నమ్మడం,విశ్వాసించడం, మరియు ప్రేమించడం దేవుని శాశ్వతమైన పరిపూర్ణ రాజ్యంలోనికి ఒకటే దారి!
ఈ భూమి మీద ప్రతి ఒకరి కొరకై ప్రశ్న: 2000 సంవత్సరమూల క్రితం ప్రతి ఒక్కరి పాపము కొరకై మూల్యం చలించడానికి ఎరుసలేంకు చావడానికి వచ్చిన దేవుని కుమారుడైన ఒక మానవుడైన యేసుని, నీవు నముచ్చునావ? నేను ఆయనను నమ్ముతున్న, ఆయనను ప్రేమించుతునాన, మరియు ఆయన త్వరలో సృష్టించుతున ఆ క్రొత్త పరిపూర్ణమైన ప్రపంచంలోనికి ఆయనను వెంబడిస్తాన?
మనం మరలా మన మొదటి ప్రశ్నకు జవాబుతో తిరిగి వెళదాం: ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మరనిస్తారని మీరు నమ్ముతునార? వ్యక్తీకతంగా, మీరు ఒక రోజు మరనిస్తారని మీరు నమ్ముతునార? మీరు మరనిచ్చాక, మీకు ఏం జరగవచ్చు? ఎక్కడికి వెల్లుతారు? పరలోకం మరియు నరకం ఉంది అని మీరు నమ్ముతునార? పరలోకం ఉంది అని మీరు నమ్మినటాయితే, మీ నిత్యత్వాని గడపడానికి మీకు ఎందుకు అనుమతి ఇవ్వాలి?
మీరు యేసు క్రీస్తునిలో విశ్వాసించి నముట అయితే ఆయన సృష్టించిన పరిపూర్ణమైన ప్రపంచంలో జీవించడానికి మీకు క్రొత్త ఆత్మను మరియు ఆధ్యాత్మికంగా ఆయన కుటుంబంలోనికి జన్మిస్తారు. దేవునికి అబద్ధం చెప్పడం అసాధ్యం. ఈ దేవుని మాటలు సత్యంము మరియు శాశ్వతముగా స్థిరమైఉనది.
మీ ముందు మరియు ప్రతి ఒక్కరి ముందు ఉన్న ఒకే ప్రశ్న. మి ప్రస్తుత మరియు శాశ్వతమైన జీవితంలో యేసు క్రీస్తుని విశ్వాసించి నమ్ముతునార?