పాపం లేని తల్లికి యేసు పుట్టలేదు. యేసు ఆయన గురించి యే విదముగా పాపరహితుడు అని పరిగణించారు?
లూకా 1:37 దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదని!
ఎందుకంటే దేవునికి యేది అసాధ్యము కాదు, ఆదాము యొక్క పాప స్వభావం యేసుపై ఆరోపించిబడలేదు దేవుడు అలాంటి యొక్క అద్బుత కార్యమును చేశారు. ఇది ఎలా సాదించబడిఉంది అనడానికి విభిన్న ఆలోచనలు ఉన్నాయి.
మన మితమైన మానవ బుద్ధివలన సత్యవేదంలో ఉన్న అనేక ప్రశ్నలను గ్రహించలేము మరి దేవుడు ఆయన సంపూర్ణ అద్బుత కార్యాల వివరణలను కనపరచక ఉండడానికి ఇది యొక్క కారణం. విశ్వాసం గురించి నిర్ణయించడానికి కావాల్సిన విషయాలని ఆయన మనకు కనపరచి ఉన్నారు. యేసు పాపరహితుడుగా జన్మించి, పాప స్వభావం లేకుండా మరి మన పాపాల కొరకై మూల్యం చెల్లించడానికి పాప రహితుడుగా మరణించారు అన్న విషయాని విశ్వాసించడానికి ఎంచుకోవాలి లేక సత్యాన్ని అవిశ్వాసించడానికి ఎంచుకోవాలి.
దేవుడు ఆదామును నేలమంటితో నిర్మించి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా అతను జీవాత్మ ఆయెను అన్న దానికన్నా ఈ సత్యని గ్రహించడం మాకు కస్టమేమి కాదు. మన మానవ బుద్ధికి ఈ యొక్క వాస్తవమును అర్థం చేసుకోవడానికి గాని గ్రహించడానికి కానీ కుదరదు, మన ఈ గ్రహింపలేని నిస్సహాయత పరిస్థితి సత్యాన్ని అబద్ధం చేయదు. హద్దులు లేని, అధిపతి అయిన, సర్వశక్తిమంతుడైన దేవుడు మరి ఆయన సృష్టి అయిన మనకు మద్య ఉన్న విస్తారమైన వ్యత్యాసాన్ని మనకు గుర్తుచేస్తుంది.
- ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
మనకు జవాబు ఇవడానికి ఇది యొక్క సులబమైన “సత్య దారి”: ఆకరిగా ఆదామును పాప స్వభావం లేకుండా సృష్టించడంలో దేవునికి ఎలాంటి సమస్య లేదు! “ఈ సకల బ్రహ్మాండమును మాటలు ద్వారా ఉనికి లోనికి” తెచ్చిన దేవునికి ఆదాము యొక్క పాప స్వభావం అతని కుమారుడికి రాకుండా కన్యయైన మరియ యొక్క జన్మమిచ్చు ద్వారమునుంచి ఈ లోకం లోనికి రప్పించడం అసాధ్యం కాదు.
- ఆదికాండము 1 :1-31 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను… దేవుడు తాను చేసి నది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
- లూకా 1: 26-38 ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి–దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి–ఈ శుభవచన మేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత – మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియ–నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత–పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించియున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము; దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియ–ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాటచొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.
క్రీస్తునిలో, మా మరింత ప్రేమతో మీకు–
జోన్+ ఫిలిస్ + స్నేహితులు @ WasItForMe.com